ఈ నెల 6న స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్లో ఈ ఏడాది 1.90లక్షల మంది విద్యార్థులు చేరారు. ఆన్లైన్లో 1.61లక్షలు, ఆఫ్లైన్లో 28వేల మంది చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఫార్మసీ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత మరికొందరు విద్యార్థులు చేరుతారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. డిగ్రీ ఫస్టియర్ సీట్ల భర్తీకి మరో అవకాశం కల్పించారు.
సోమవారం దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల చేశారు. 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. 20, 21 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 22న ఇంట్రాకాలేజీ ైస్లెడింగ్ సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.