06.04.2021, మంగళవారం మీ రాశిఫలాలు
రాశిఫలాలు | అన్ని కార్యాములందు విజయాన్ని సాధిస్తారు. రాశిఫలాలు

మేషం : అన్ని కార్యాములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
వృషభం : అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది.
మిథునం : ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటకం : నూతన వస్తు, వస్త్ర, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
సింహం : తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
కన్య : ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శత్రుబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుల పనికిరాదు. ప సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
తుల : బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృశ్చికం : ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
ధనస్సు : కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
మకరం : ధర్మ కార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కుంభం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు.
మీనం : మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి.
– పంచాంగ కర్త
గౌరీభట్ల రామకృష్ణ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
సెల్ : 94403 50868
ఇవి కూడా చదవండి..
సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ
గడువు ముగిసినా.. తేదీ మార్చెయ్
డైలీ కార్టూన్ 06-04-2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

