కావలసిన పదార్థాలు:
మామిడి పండ్ల ముక్కలు: 2 కప్పులు, చక్కెర: 50 గ్రా.,
పాలు: ఒక లీటరు,
యాలకుల పొడి: సగం టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా మామిడి పండు చెక్కు తీసి ముక్కలు చేసుకుని అరకప్పు పాలు, చక్కెర వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన మామిడి గుజ్జులో మిగతా పాలు, యాలకుల పొడి వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. కొంతసేపు ఫ్రిజ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే.. చల్లచల్లని మ్యాంగో మిల్క్ షేక్ రెడీ.