కేసీఆర్ ఆలోచన, వ్యవహార సరళి ఇతరులకు భిన్నంగా ఉంటుంది… స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడినప్పుడు వారు, సాఫ్ట్వేర్ ఇతర ఇంజినీరింగ్ స్కిల్స్ గురించి మాత్రమే చెబుతున్నారు. కానీ కేసీఆర్ ఆలోచన వేరు. గ్రామీణ వృత్తుల్లో గొర్రెల పెంపకం, చేపలు పట్టడం స్కిల్స్ కావా? అనేది కేసీఆర్ వేసిన ప్రశ్న! కొత్తగా శిక్షణ అవసరం లేదు. ఇప్పటికే గ్రామీణ వృత్తులలో నైపుణ్యాలు గలవారికి ప్రోత్సాహం ఇస్తే గ్రామం భాగ్యవంతం అవుతుంది, సంపద పెరుగుతుంది. ఇప్పుడంతా పట్టణాల అభివృద్ధి వైపు ప్రపంచం నడుస్తున్నది. కానీ కేసీఆర్ వినూత్న రీతిలో పల్లెల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. నీరు పల్లమెరుగు అనేది ప్రకృతి సూత్రం. ఆనకట్టలు కట్టేవారంతా నీటిని దిగువకు పారించడంపై ఆలోచిస్తారు. కానీ, పైకి పారించడమనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? దట్ ఈజ్ కేసీఆర్!
అమెరికా అత్యంత ధనిక దేశమే కాదు. ఎక్కువ అప్పులున్న దేశం కూడా. అటువంటి అమెరికా తెలివిలేక అప్పులు చేసిందా? అప్పులు తెచ్చేది తినడానికి కాదు, అభివృద్ధి కోసం. దేశంలో 25 ఏండ్లకు బాండ్లను జారీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే.