గోవిందరావుపేట/ కృష్ణకాలనీ/ ఏటూరునాగారం/ మల్హర్/మొగుళ్లపల్లి, అక్టోబర్28: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతకు శుక్రవారం భక్తులు పూజలు నిర్వహించారు. గోవిందరావుపేట మండలం పస్రా రామాలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పండితులు దింగర రంగాచార్యులు హోమం, పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ అనిశెట్టి రామకృష్ణ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బైరీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగపేటలోని ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణా దేవిగా దర్శనమిచ్చారు. కమలాపురం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలను నిర్వహించారు. అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భూపాలపలి ప్లట్టణంలో దుర్గామత బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చింది. పట్టణంలోని రెడ్డి కాలనీలో సతీశ్ సౌదాని శర్మ, కృష్ణకాలనీలో కుదురుపాక కృష్ణమాచార్యులు, కారల్ మార్క్స కాలనీలో ఛతురూప అయ్యప్ప సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో కుదరుపాక విష్ణుశర్మచార్యులు, జవహర్ నగర్, సుభాష్ కాలనీ, రాజీవ్ నగర్, శాంతినగర్ కాలనీల్లో పూజలు నిర్వహించారు.
6వ వార్డు కౌన్సిలర్ ఎడ్లమౌనిక శ్రీనివాస్, 30వ వార్డు కౌన్సిలర్ మాడ కమల లక్ష్మారెడ్డి, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో దుర్గామాత గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయం, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయ నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన మండపాల్లో పూజలు చేశారు. మల్హర్ మండలంలోని తాడిచర్ల, వల్లెకుంట గ్రామాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. వల్లెకుంట జంబూద్వీప శక్తిపీఠపాలిత శ్రీత్రిశక్తి పీఠ దేవస్థానంలో ఆమ్మవారు త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చరు. ఆలయ ప్రధాన ఆర్చకులు గడ్డం సతీశ్ భవాని కుంకమ పూజలు నిర్వహించారు. మొగుళ్లపల్లిలోని శివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను గాయత్రీ మాతగా అలంకరించారు. క్యాతరాజు రాజయ్య దంపతులు పూజలు నిర్వహించారు. శివరామకృష్ణ భజన మండలి సభ్యులు అన్నారెడ్డి, శ్రీనివాస్, నవీన్‌కుమార్, మల్లేశం పాల్గొన్నారు.