2014 ఎన్నికలలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిన వెంటనే- నందీనగర్లోని కేసీఆర్ నివాసం సందర్శకులతో కిటకిటలాడింది. పోలీసు శాఖకు చెందిన ఒక ట్రెయినీ అధికారుల బృందం వచ్చి కేసీఆర్ను కలిసి తమ సమస్యలను, కోరికలను వివరించింది. ‘మీరు చెప్పినవి సరే. ఇంతకన్నా మించిన సమస్యలు మీకున్నాయి. అంటూ కేసీఆర్ చిట్టా విప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. పోలీసు శాఖ సీనియర్ అధికారులు కూడా ఆయన విజన్ చూసి ఆశ్చర్యపోయారు. తెలంగాణ పోలీసు విభాగాన్ని అంతర్జాతీయ శ్రేణికి తీర్చిదిద్దాలనేది కేసీఆర్ ఆలోచన. ‘కేసీఆర్ మీటింగ్కు వెళ్ళాం. మా ఫైళ్ళలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. పరకాయ ప్రవేశం చేసి చూశారా అనిపించింది ఆయన ప్రసంగం వింటుంటే’ అని ఒక అధికారిణి అన్నారు. నీటి పారుదల అధికారులతో వరుసగా భేటీ అయ్యేవారు. ‘మేం వెళ్ళినప్పుడల్లా ముఖ్యమంత్రి మరింత అవగాహనతో, కొత్త సూచనలతో వస్తారు’ అని ఒక నీటిపారుదల శాఖ ఇంజినీర్ అన్నారు. ప్రతి కాలువ, పిల్ల కాలువ ఆయనకు తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ కలిపితే నీళ్ళు ఎక్కడికి చేరుతాయో తెలుసు. అర్ధరాత్రి వేళ కూడా కేసీఆర్ బుర్ర నిండా అనేక ఆలోచనలు. రాత్రి మూడు గంటలకు నిద్ర లేచి కంప్యూటర్ ఓపెన్ చేయించి పరిశీలించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
ప్రజల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తున్నది. తెలంగాణ కోసం ఎన్నో ఆత్మబలిదానాలు జరిగాయి. నేను చావు అంచువరకు వెళ్లి మీ అందరి దయ వల్ల బతికి బయటపడ్డా. రాష్ర్టాన్ని సాధించుకున్నం. రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి బంగారు తెలంగాణ తయారు చేసి ప్రజల చేతుల్లో పెడుతా.
– కేసీఆర్