న్యూఢిల్లీ, అక్టోబర్ 29: జియోఫోన్ నెక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ ఈ దీపావళికి మార్కెట్లో అడుగు పెడుతున్నది. ధర రూ.6,499గా ఉన్నది. ఈ మేరకు శుక్రవారం జియో, గూగుల్ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. జియోఫోన్ నెక్స్‌ను జియో టెలికం, గూగుల్ కలిసి రూపొందించిన విషయం తెలిసిందే. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 215 చిప్సెట్తో తయారైన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ ద్వారా పనిచేస్తుంది. ఇక రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్ వంటి ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లున్న ఈ ఫోన్.. అన్ని గూగుల్ యాప్స్‌నూ సపోర్ట్ చేస్తుంది. జియోమార్ట్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఫీచర్ ఫోన్ యూజర్లు, 2జీ కస్టమర్ల అప్‌గ్రేడ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈఎంఐల సదుపాయాన్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కల్పించింది. తొలుత రూ.1,999 చెల్లించి మిగతా మొత్తాన్ని (రూ.4,500) 18 నుంచి 24 నెలల సులభ వాయిదాల్లో చెల్లించుకొనే అవకాశాన్ని ఇచ్చింది.
స్క్రీన్: 5.5 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్ప్లే
బ్యాక్ కెమెరా: 13 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సల్
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ: 32జీబీ
(512 జీబీదాకా
పెంచుకోవచ్చు)
సిమ్: డ్యూయల్
బ్యాటరీ:3,500 మెగాహెట్జ్
సులభ వాయిదాల్లో జియోఫోన్ నెక్స్‌ను కొనే తమ కస్టమర్ల కోసం నాలుగు రకాల ఈఎంఐ ప్లాన్లను జియో ఈ సందర్భంగా ప్రకటించింది. నెలసరి ఫోన్ పేమెంట్స్‌తోపాటు డాటా, టాక్-టైం బండిల్డ్ ఆఫర్లను కలిపి ఈ ప్లాన్ల ఈఎంఐలను నిర్ణయించింది.
18-24 నెలలు. కస్టమర్లు టీనర్నుబట్టి నెలనెలా రూ.300 లేదా రూ.350 చెల్లించవచ్చు. ప్రతినెలా 5జీబీ 4జీ డాటాతోపాటు 100 నిమిషాల టాక్-టైం పొందుతారు.
ఇందులో 18 నెలల కోసం నెలనెలా రూ.500, 24 నెలల కోసం నెలనెలా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 1.5జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్ అందుకోవచ్చు.
18 నెలల కోసం నెలనెలా రూ.550, 24 నెలల కోసం నెలనెలా రూ.500 చెల్లించాలి. రోజుకు 2జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి.
18 నెలల కోసం నెలనెలా రూ.600, 24 నెలల కోసం నెలనెలా రూ.550 చెల్లించాలి. రోజూ 2.5జీబీ 4జీ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి..