కేసీఆర్ సహజ నాయకుడు. తనకంటూ ఓ సమ్యక్ దృష్టి ఉంది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, చాలా సందర్భాల్లో కేసీఆర్ శైలి చాణక్యుడి అర్థశాస్త్రంలోని పాలనా సూత్రాలకు దగ్గరగా అనిపిస్తుంది. ‘సుఖస్య మూలం ధర్మం’ అంటాడు చాణక్యుడు. ధర్మబద్ధమైన పాలన జరగాలంటే, ధర్మాన్ని ఆచరించే నాయకుడు ఉండాలి. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలబడటానికి కారణం.. కేసీఆర్ ధర్మాచరణే. ‘వెయ్యి కుక్కల్ని పెంచడం కంటే, ఒక గోవును పెంచడమే ఉత్తమం’ అంటూ అనుచరుల విషయంలో పాలకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తాడు అర్థశాస్త్ర రూపకర్త. కేసీఆర్ ఆ తరహా కుక్కబుద్ధి నేతల్ని ఏదో ఓ దశలో వదిలించుకొంటూనే ఉన్నారు. జనానికి ఏం అవసరమో అదే ఇవ్వాలి. క్షీరార్థినః కిం కరిణ్యా? గిన్నెడు పాలు అవసరమైన వారికి, అంతెత్తు ఏనుగునిస్తే లాభం ఏమిటి? జనానికి ఏం అవసరమో జనం మనిషిగా కేసీఆర్కు తెలుసు. డబుల్ బెడ్రూమ్ నుంచి దళిత బంధు వరకూ.. అన్నీ జనం మెచ్చిన పథకాలే!
హైదరాబాద్ ఓ గ్లోరియస్ సిటీ. మద్రాస్ కంటే ముందుగా విద్యుచ్ఛక్తి కలిగిన నగరం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా 42 సంవత్సరాలపాటు హైదరాబాద్ నగరం ఢిల్లీ కంటే పెద్దది.