నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు? ఎ) మెజారిటీ పార్టీ అధ్యక్షుడు బి) ప్రధానమంత్రి సి) ఆర్థికమంత్రి డి) రాష్ట్రపతి
ప్రణాళిక సంఘం చైర్మన్? ఎ) ప్రధానమంత్రి బి) రాష్ట్రపతి సి) ఉపరాష్ట్రపతి డి) ఆర్థికమంత్రి
ప్రధానమంత్రి కార్యాలయ అధిపతి? ఎ) ఉపరాష్ట్రపతి బి) లోక్‌సభ సెక్రటరీ జనరల్ సి) పార్లమెంట్ వ్యవహారాల మంత్రి డి) ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ
జూన్ 1977కు ముందు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏ పేరుతో పిలిచేవారు? ఎ) భారతదేశ సచివాలయం బి) హౌస్ ఆఫ్ ది నేషనల్ లీడర్ సి) ప్రధానమంత్రి సచివాలయం డి) ఏదీకాదు
మంత్రిమండలి నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం 1948లో నియమించిన కమిటీ? ఎ) గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ బి) అనంతశయనం అయ్యంగార్ కమిటీ సి) గోపాలకృష్ణ కమిటీ డి) ఏదీకాదు
కేబినెట్ సెక్రటేరియట్‌కు అధిపతి ఎవరు? ఎ) పార్లమెంట్ సెక్రటరీ బి) కేబినెట్ సెక్రటరీ సి) ప్రధానమంత్రి డి) ఉపరాష్ట్రపతి
ప్రభుత్వ పాలనకు సంబంధించి కార్యదర్శుల కమిటీకి చైర్మన్? ఎ) లోక్‌సభ సెక్రటరీ జనరల్ బి) పార్లమెంట్ వ్యవహారాల మంత్రి సి) ఉపరాష్ట్రపతి డి) ప్రధానమంత్రి
కేబినెట్ సెక్రటేరియట్లో ఏ విభాగాలు ఉంటాయి? ఎ) భద్రత, సమన్వయం బి) రా ( Raw) సి) పై రెండూ డి) ఏదీకాదు
వివిధ మంత్రిత్వ శాఖలన్నీ కలిసిన కార్యాలయాన్ని ఏమంటారు? ఎ) మంత్రిత్వ సచివాలయం బి) కేంద్ర సచివాలయం సి) రాష్ట్రీయ సచివాలయం డి) ఏదీకాదు
ఏదైనా మంత్రిత్వ శాఖకు రాజకీయ అధిపతి? ఎ) సంబంధిత మంత్రి బి) కార్యదర్శి సి) రాష్ట్రపతి డి) ప్రధానమంత్రి
ప్రభుత్వశాఖకు అధికార అధిపతి? ఎ) కార్యదర్శి బి) సంబంధిత మంత్రి సి) ప్రధానమంత్రి డి) రాష్ట్రపతి
కేంద్ర సచివాలయాన్ని కింది రకాలుగా విభజించారు? ఎ) శాఖ, డివిజన్, సెక్షన్ బి) శాఖ, వింగ్, బ్రాంచ్ సి) శాఖ, వింగ్, డివిజన్, బ్రాంచ్, సెక్షన్ డి) డివిజన్, శాఖ
‘Top Management’ గా ఎవరిని వ్యవహరిస్తారు? ఎ) కార్యదర్శి, అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బి) డైరెక్టర్, ఉపకార్యదర్శి, అండర్ కార్యదర్శి సి) సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్, ఉపకార్యదర్శి డి) ఏదీకాదు
మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌గా ఎవరిని వ్యవహరిస్తారు? ఎ) డైరెక్టర్, ఉపకార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బి) డైరెక్టర్, ఉపకార్యదర్శి, అండర్ సెక్రటరీ సి) సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్, ఉపకార్యదర్శి డి) ఏదీకాదు
కేంద్ర సచివాలయంలో కాలపరిమితి పద్ధతి ఎప్పటి నుంచి అమల్లో ఉంది? ఎ) 1885 బి) 1900 సి) 1905 డి) 1910
వివిధ రాష్ర్టాల నుంచి అధికారులు కొంత కాలం కేంద్ర సచివాలయంలో పనిచేసి తిరిగి రాష్ర్టాలకు వెళ్లడాన్ని ఏమంటారు? ఎ) వికేంద్రీకరణ పద్ధతి బి) కాలపరిమితి పద్ధతి సి) కేంద్రీకరణ పద్ధతి డి) ఏదీకాదు
కేంద్ర సచివాలయంలో క్రమానుగతశ్రేణిలో మొదటి అంచె పర్యవేక్షకుడు ఎవరు? ఎ) అదనపు కార్యదర్శి బి) సెక్షన్ ఆఫీసర్ సి) అండర్ సెక్రటరీ డి) కార్యదర్శి
మంత్రులకు సివిల్ సర్వెంట్లకు మధ్యవర్తిత్వం చేసేది? ఎ) రాష్ట్రపతి బి) అండర్ సెక్రటరీ సి) లోక్‌సభ సెక్రటరీ జనరల్ డి) కేబినెట్ సెక్రటరీ
కేబినెట్ ర్యాంక్ అనే మంత్రి స్థానంలో రాజ్యమంత్రి అనే పేరును ఏ సంవత్సరం నుంచి అనుసరిస్తున్నారు? ఎ) 1957 బి) 1975 సి) 1955 డి) 1956
15 ఆగస్ట్ 1947కు ముందు తొలి కేబినెట్ సెక్రటరీ ఎవరు? ఎ) ఎరిక్ హాని బి) విలియమ్స్ స్పాన్లే సి) సర్ ఎరిక్కోట్స్ డి) ఎవరూ కాదు
కేబినెట్ సచివాలయం ప్రత్యేకంగా కింది వారికోసం ఏర్పడలేదు? ఎ) ప్రధానమంత్రి బి) కేబినెట్ సి) ఎ, బి డి) ఉపరాష్ట్రపతి
కేబినెట్ సచివాలయం ప్రభుత్వ కార్యకలాపాలను ఎవరికి తెలియజేస్తుంది? ఎ) మంత్రులు బి) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సి) ఎ, బి డి) స్పీకర్
కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన సమన్వయ సంస్థ? ఎ) ప్రధానమంత్రి కార్యాలయం బి) కేబినెట్ సచివాలయం సి) కేంద్ర సచివాలయం డి) ఆర్థిక సంఘం
కేబినెట్ సెక్రటరీ విధి? ఎ) అన్ని శాఖల పాలనావ్యవహారాలు చూడటం బి) అన్ని శాఖలపై పర్యవేక్షణ చేయడం సి) ఎ, బి డి) ఏదీకాదు
కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఏ ప్రకరణలో కనిపిస్తుంది? ఎ) 352 ప్రకరణ బి) 353 ప్రకరణ సి) 354 ప్రకరణ డి) 355 ప్రకరణ
పోర్ట్‌ఫోలియో విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎ) 1659 బి) 1759 సి) 1859 డి) 1959
పోర్ట్‌ఫోలియో విధానాన్ని ఎప్పుడు చట్టబద్ధంగా గుర్తించారు? ఎ) 1817 బి) 1871 సి) 1978 డి) 1776
ఈస్టిండియా కంపెనీ రికార్డుల్లో సివిల్ సర్వెంట్ అనే పదాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎ) 1756 బి) 1765 సి) 1766 డి) 1776
చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్సుకు అధ్యక్షత వహించేది? ఎ) ప్రధానమంత్రి బి) రాష్ట్రపతి సి) ఉపరాష్ట్రపతి డి) కేబినెట్ సెక్రటరీ
ప్రధానమంత్రి కార్యాలయాని (పీఎంవో)కి సంబంధించి కింది వాటిలో సరికానిది? ఎ) 1978కు ముందు దీనిని ప్రధాని సెక్రటేరియట్ అని పిలిచేవారు బి) ప్రధానమంత్రి కార్యాలయానికి డిపార్ట్మెంట్ హోదా ఉంది సి) ప్రధానమంత్రి విధులకు ఇది బాధ్యత వహిస్తుంది డి) ప్రధానమంత్రి కార్యాలయం వల్ల కేబినెట్ సెక్రటేరియట్ ప్రాముఖ్యత తగ్గిపోయింది
ప్రణాళిక సంఘాన్ని కేంద్ర రాష్ర్టాలకు ఆర్థిక కేబినెట్‌గా వర్ణించింది? ఎ) వీరప్ప మొయిలీ బి) ఆర్ఎస్ సర్కారియా సి) అశోక్ చందా డి) మొరార్జీ దేశాయ్
ప్రధానమంత్రి సచివాలయం ఎప్పుడు ఏర్పాటయ్యింది? ఎ) 15 ఆగస్ట్ 1947 బి) 26 జనవరి 1950 సి) 15 ఆగస్ట్ 1948 డి) 26 జనవరి 1951
ఏ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి సచివాలయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అంటున్నారు? ఎ) 1967 బి) 1977 సి) 1987 డి) 1978
కింది అధికారులను అవరోహణ క్రమంలో అమర్చండి? ఎ) కార్యదర్శి బి) సంయుక్త కార్యదర్శి సి) ఉపకార్యదర్శి డి) అదనపు కార్యదర్శి ఎ) ఎ, బి, సి, డి బి) బి, సి, డి, ఎ సి) ఎ, డి, బి, సి డి) సి, డి, బి, ఎ
ఏ బిల్లు ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు? ఎ) పన్ను సంబంధిత బిల్లు బి) వ్యాపారం పై ఆంక్షలు విధించే బిల్లు సి) రాష్ర్టాల పునర్విభజన బిల్లు డి) పైవన్నీ
కనీస మద్దతు ధరల పథకాన్ని 1996-97లో ఏ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది? ఎ) వ్యవసాయ మంత్రిత్వశాఖ బి) మానవ వనరుల అభివృద్ధిశాఖ సి) వాణిజ్య శాఖ డి) ఏదీకాదు
ఏ ప్రకరణ ప్రకారం మైనారిటీలు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు? ఎ) ప్రకరణ 29 బి) ప్రకరణ 30 సి) ప్రకరణ 30( 1) డి) ప్రకరణ 31
షెడ్యూల్డ్ కులాలను నిర్ధారించే అధికారం ఎవరికి ఉంటుంది? ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి సి) షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్ డి) సుప్రీంకోర్టు