ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నగొర్నో కరబఖ్ ప్రాంతంలో కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో యుద్ధానికి ప్రస్తుతం తాత్కాలిక బ్రేక్ పడింది. కాల్పుల్లో తన ఇల్లు ఏ విధంగా ధ్వంసం అయిందో ఓ మహిళ తన ఇంటి వంట గదిలో నిలబడి చూపుతున్న దృశ్యం.
మాడ్రిడ్‌లోని రెటిరో పార్క్‌లో మాస్కులు లేకుండా క్రీడలకు అనుమతించిన నేపథ్యంలో ఓ వ్యక్తి ఫేస్ మాస్క్ లేకుండా స్కేట్‌బోర్డును నడుపుతున్నాడు.
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలోని ఓ మార్కెట్‌యార్డులో గోధుమ బస్తాలను లారీలోకి ఎత్తుతున్న కూలీలు.