Russia – Ukraine Conflict | ఉక్రెయిన్లో రష్యా హింసాకాండ కొనసాగుతోంది. రష్యా విరుచుకుపడటం చూసి ఉక్రెయిన్ వాసులు భయంతో వణికిపోతున్నారు. బాంబు షెల్టర్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే రష్యా దాడిని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.