మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. నీటిపై నుంచి విరజిమ్ముతున్న రంగురంగుల వెలుగులు.. అబ్బురపరిచే తీగల వంతెన.. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్ కొత్త సోయగాలతో కనువిందు చేసింది. నూతన సంవత్సర వేడుకులను యువత కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసింది. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు ఖమ్మం నగరవాసులతో సందడిగా మారింది.