snowfall in Kashmir | జమ్మూకశ్మీర్‌ను మంచు దుప్పటి కమ్మేసింది. ఇండ్లు, వాహనాలు, రోడ్లు, పర్వతాలు, ఇలా ఎక్కడ చూసి తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచు కమ్మేసి కశ్మీరం మరింత సుందరంగా కనిపిస్తుంది. అయితే కొద్దిరోజులుగా కురుస్తున్న హిమపాతం కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. బారాముల్లా జిల్లాలో ప్రముఖ స్కై రిసార్ట్ అయిన గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మైనస్ 10.6 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. కశ్మీర్‌లోయలో గత మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు వరుసగా మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్కడ కూడా మంచు కురుస్తున్నది.