రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీటితో నిండి జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణతో పాటు దక్షిణ చత్తీస్ఘడ్, విదర్భ ప్రాంతాల్లో ఇవాళ, రేపు జోరుగా వానలు కురవనున్నాయి.