Hanuman Jayanthi | హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్రలు ఘనంగా సాగాయి. జై హనుమాన్.. జై శ్రీరాం.. రామలక్షణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలతో ఆలయాలు మార్మోగాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి దీక్షాపరులు పోటెత్తారు. మాలవిరమణ అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు.