ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోత.. అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వేసవి తాపం నుంచి సేదతీరేందుకు మనుషులతో పాటు మూగజీవాలు దారులు వెతుక్కుంటున్నాయి.
ఈ క్రమంలో దగ్గరలోని ఓ చెరువులో గేదెలు ఎండ నుంచి ఉపశమనం పొందుతుంటే.. వెనకే వెళ్లిన పిల్లలు కూడా వాటితో పాటు అందులో సేదతీరారు.
గేదెలతోనే ఇలా ఆటలు ఆడారు.
ప్రపంచ నీటి దినోత్సవానికి ముందు రోజైన ఆదివారం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో కనిపించిందీ దృశ్యం