Digital Payments | పల్లెల్లో చిన్నారుల జాజిరి సంబురం మొదలైంది. హోళీ పండుగ వరకు చిన్నారులు జాజిరి ఆడుతూ ఇంటింటికీ వెళ్లి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ప్రస్తుతం చిల్లర సమస్య తలెత్తుతుండడంతో చిన్నారులు కూడా డిజిటల్ పే వైపు మొగ్గు చూపుతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో జాజిరి ఆడుతున్న చిన్నారుల బ్యాచ్‌కు కూడా ఇదే సమస్య తలెత్తగా, వారికి అందుబాటులో ఉన్న క్యూ ఆర్ కోడ్‌తో ఇలా జాజిరి ఆడడం కనిపించింది.