Good News | త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా.. కోటి డోసులకు కేంద్రం ఆర్డర్
ZyCoV-D Vaccine | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా నుంచి కోటి డోసుల జైకోవ్-డీ వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలలో జాతీయ కొవిడ్ టీకాల క్యాంపెయిన్‌లో చేర్చనున్నారు. టీకాలు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
కోటి డోసులకు ఆర్డర్
జైకోవ్-డీ కోటి డోసుల కోసం కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో వ్యాక్సిన్‌కు జైడస్ క్యాడిలా పన్నులు మినహాయించగా.. టీకా ధరను రూ.358 నిర్ణయించినట్లు సమాచారం. ఇందులోనే రూ.93 విలువైన టీకాను వేసే ‘జెట్ అప్లికేటర్’ను కూడా సరఫరా చేయనున్నది. వ్యాక్సిన్ సూది రహితం కావడంతో.. ఈ జెట్ అప్లికేటర్ సహాయంతోనే టీకాను వేయనున్నారు. కంపెనీ నెలకు కోటి డోసుల జైకోవ్-డీ టీకాలను అందించే స్థితిలో ఉందని కంపెనీ అధికారులు మంత్రిత్వశాఖకు తెలిపారు.
మూడు డోసుల టీకా..
ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత, మూడు డోసుల వ్యాక్సిన్. తొలి డోస్ తర్వాత 28 రోజులకు రెండో డోస్, 56 రోజులకు మూడో డోసు వేయనున్నారు. జైకోవ్-డీ వాక్సిన్‌కు ఆగస్ట్ 20న డ్రగ్ క్రంటోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన విషయం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ సెప్టెంబర్ 30న త్వరలోనే టీకాను దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమంలో ఉపయోగించనున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

