న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : లోక్‌సభలో ఒక కొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు 202 మంది ఎంపీలు గురువారం ఐదు గంటలకు పైగా జీరో అవర్‌లో ప్రసంగించి రికార్డు సృష్టించారు. అంతకు ముందు 2019 జూలై 18న పొడిగించిన జీరో అవర్‌లో 161 మంది ఎంపీలు ప్రసంగించారని లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చొరవ తీసుకుని జీరో అవర్‌ను పొడిగించారని సచివాలయం పేర్కొంది. ‘ఈ రోజు ఐదు గంటలకు పైగా జరిగిన జీరో అవర్‌లో 202 మంది ఎంపీలకు వివిధ సమస్యలపై మాట్లాడే అవకాశం వచ్చింది’ అని సచివాలయం తెలిపింది.