న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల వేళ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ క్యాటగిరీ వీఐపీ భద్రత కల్పించింది. ఎన్నికల సందర్భంగా ఆయనకు ముప్పు ఉందంటూ వచ్చిన సమాచారం మేరకు ఈ భద్రత కల్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ మంగళవారం ప్రకటించింది. దీని కింద 40-45 మంది సాయుధ సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణగా ఉంటారు. సీఈసీకి ఇలా జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించడం అరుదైన విషయంగా పేర్కొనవచ్చు. గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఇలా భద్రత కల్పించారు.