గురువారం 04 జూన్ 2020
National - Apr 01, 2020 , 17:24:57

వైరస్‌ సోకితే ఏదో జరిగిపోతుందని భయపడొద్దు

వైరస్‌ సోకితే ఏదో జరిగిపోతుందని భయపడొద్దు

అమరావతి‌:  ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటి వరకు 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

1085 మంది ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. వీరిలో 585 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాం.   ఇంకా 21మందిని గుర్తించాల్సి ఉంది. ఇందులో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి సంబంధికులవే.  ఢిల్లీ వెళ్లి వచ్చినవారి సంబంధీకులు స్వచ్ఛందంగా బయటకురావాలి. 104కు ఫోన్‌ చేస్తే వెంటనే వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తారు. ఎవరైనా వైద్య పరీక్షలు చేయించుకోకపోతే చికిత్స చేయించుకొని స్వీయ నిర్బంధంలో ఉండాలి. 

రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నాం. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతోంది. వైరస్‌ లక్షణాలను గుర్తించి వైద్య సేవలు అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నాం.  ఢిల్లీకి వెళ్లివచ్చిన వారికి వైరస్‌ సోకింది. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తిస్తున్నాం. వైరస్‌ సోకితే ఏదో జరిగిపోతుందని భయపడవద్దు. దేశాధినేతలకు కూడా కరోనా సోకిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 


logo