Sunny Yadav | హైదరాబాద్ : యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల బైక్‌పై పాకిస్తాన్ టూర్‌కు వెళ్లిన సన్నీ యాదవ్‌ను చెన్నై విమాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ టూర్ వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో యూ ట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, అంతర్జాతీయ బైక్ రైడర్ బయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయంలో ఈ ఏడాది మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసు స్టేషన్లో సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది.
విచారణలో భాగంగా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు నాడు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్ వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్ దేశంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. పాకిస్తాన్ బైక్ టూర్‌ను పూర్తి చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్ తిరిగి ఇండియాకు రాగా, చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.