న్యూఢిల్లీ, జూన్ 19: వృద్ధుడి వేషధారణలో కెనడా వెళ్లేందుకు యత్నించిన 24 ఏండ్ల యువకుడిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. గడ్డానికి, జుట్టుకు రంగు వేసుకొని వృద్ధుడి మాదిరిగా మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన గురుసేవక్ సింగ్ అనే ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో టెర్మినల్-3 వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. రష్విందర్సింగ్ సహోటా 67 ఏండ్ల వృద్ధుడిగా నకిలీ పాస్పోర్టుతో విమానాశ్రయానికి వచ్చాడు. గడ్డం, జుట్టు తెల్లగా వృద్ధుడి తరహాలో ఉన్నప్పటికీ అతడి స్కిన్, కదలికలు చురుకుగా ఉండటంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ అధికారి బుధవారం వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం యువకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్టు పేర్కొన్నారు.