LPG cylinders | ఇకపై నిమిషాల్లో సిలిండర్ డెలివరీ.. తొలుత బెంగళూరులో ప్రారంభం
ఎల్పీజీ సిలిండర్లను ఇకపై స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని, నిమిషాల్లో పొందవచ్చు. కర్ణాటకలోని బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల డెలివరీని మరింత సులభతరం చేసేందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.
- హెచ్పీసీఎల్తో స్విగ్గీ ఒప్పందం
- తొలుత బెంగళూరులో ప్రారంభం
బెంగళూరు: ఎల్పీజీ సిలిండర్లను ఇకపై స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని, నిమిషాల్లో పొందవచ్చు. కర్ణాటకలోని బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల డెలివరీని మరింత సులభతరం చేసేందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో వినియోగదారులు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా సిలిండర్లను ఆర్డర్ చేసుకోవచ్చు. దేశంలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి ఈ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దేశంలోని పలు పట్టణాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు హెచ్‌పీసీఎల్‌కు చెందిన 10 కేజీల ‘హెచ్‌పీ నవ్య’ కాంపోజిట్ సిలిండర్‌తో పాటు, ఐదు కేజీల సంప్రదాయ మెటల్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం వినియోగదారులు ‘హెచ్‌పీ నవ్య’ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సిలిండర్లు మూడు పొరల ఫైబర్ గ్లాస్‌తో తయారవుతాయి. ఇవి పారదర్శకంగా ఉండటంతో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సిలిండర్ ఆర్డర్ చేసిన 30-40 నిమిషాల్లోనే అందుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

