న్యూఢిల్లీ, జూన్ 17: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్‌లో వెబ్ పేజీలను చదవి వినిపించే ‘లిజన్ టు దిస్ పేజ్’ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా యూజర్లకు నచ్చిన వెబ్ పేజీలోకి వెళ్లి టెక్ట్స్‌ను ఆడియో రూపంలో వినొచ్చు. ఈ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నది. 12 భాషలకు ఈ సదుపాయం సపోర్ట్ చేస్తుందని, ప్రస్తుతానికి అన్ని వెబ్ పేజీలకు ఈ ఫీచర్ పనిచేయటం లేదని తెలిసింది. సపోర్ట్ చేసే పేజీలకు మాత్రమే ప్లేబ్యాక్ సదుపాయం కనిపిస్తున్నది.