సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘బాబా కా బుల్డోజర్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యోగి హెలీకాప్టర్లో కూర్చుని వీటిని చూసుకుంటూ మురిసిపోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.