Yogi Adityanath : దేశ ప్రజలు కలిసికట్టుగా ఉంటేనే జాతి మనుగడ సాగుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. జన్మాష్టమి వేడుకల సందర్బంగా ఆగ్రాలో సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మనమంతా కలిసి ఉంటేనే జాతి పటిష్టంగా ఉంటుందని చెప్పారు. బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఉటంకిస్తూ మనం విడిపోతే బలహీనపడతామని వ్యాఖ్యానించారు.
ఐక్యత లేకుండా మనం ఏదీ సాధించలేమని, మనం ఐక్యంగా ఉంటే విజయాలు సాధిస్తామని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూశాం..మనం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం విడిపోతే భంగపడతామని స్పష్టం చేశారు. బంగ్లాలో జరిగిన పొరపాట్లు ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. విడిపోతే మనం పడిపోతామని యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం, ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు.
బంగ్లాదేశ్ అలజడిపై యోగి ఇటీవల ప్రకటన ప్రధాన మంత్రి పదవిపై ఆయన ఆశలను వెల్లడిస్తోందని అన్నారు. ప్రధాని పదవిపై తాను కన్నేశానని ఇప్పటికే పలుమార్లు యోగి ఆదిత్యానాథ్ సంకేతాలు పంపారని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమ విషయాల్లో ఆయన జోక్యం చేసుకోరాదని ఢిల్లీలోని అధికారులు స్పష్టం చేస్తారని తాను అనుకుంటున్నానని అఖిలేష్ పేర్కొన్నారు.
Read More :
Dhaka | బంగ్లాదేశ్లో మరోసారి చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు