లక్నో: శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం, మాంసం అమ్మకాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మద్యం, మాంసం వ్యాపారం చేస్తున్న వారంతా.. పాల ఉత్పత్తిని పెంచి మధురకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నారు. ఒకప్పుడు పాల ఉత్పత్తికి మధుర ప్రసిద్ధి గాంచింది. ఇక కరోనా మహమ్మారిని పారద్రోలాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు యోగి పేర్కొన్నారు.