Yemen court: నిమిషా ప్రియాకు మరణశిక్ష.. అప్పీల్‌ను తిరస్కరించిన యెమెన్ కోర్టు
Yemen court: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు యెమెన్‌లో మరణశిక్ష విధించారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని పెట్టుకున్న అభ్యర్థనను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
న్యూఢిల్లీ: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు యెమెన్‌లో మరణశిక్ష విధించారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని పెట్టుకున్న అభ్యర్థనను ఆ దేశ సుప్రీంకోర్టు(Yemen court) తిరస్కరించింది. దేశ పౌరుడిని హత్య చేసినందుకు ఆ మలయాళీ నర్సుకు శిక్ష ఖరారైంది. ఈ విషయం గురించి ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం విన్నవించింది. నిమిషా ప్రియకు ఇప్పుడు కేవలం యెమెన్ దేశాధ్యక్షుడు మాత్రమే క్షమాభిక్ష పెట్టగలరని కేంద్రం తెలిపింది. యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రియ తల్లి ప్రేమ మేరీ అభ్యర్థన పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు వారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తన తీర్పులో ఆదేశించింది.
తలాల్ అబ్దో మహది అనే యెమెన్ జాతీయుడిని నిమిషా ప్రియ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన కుమార్తె రిలీజ్ గురించి మహది కుటుంబంతో మాట్లాడేందుకు తల్లి సిద్దమైంది. మహది కుటుంబానికి డబ్బులు చెల్లించేందుకు ప్రియా తల్లి రెఢీగా ఉంది. కానీ యెమెన్ సుప్రీంకోర్టు మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రియా భర్త, ఆమె కూతురు 2014లో ఇండియాకు రిటర్న్ వచ్చారు. కానీ ఉద్యోగం వల్ల ప్రియా వెనక్కి రాలేకపోయింది. అయితే ఉద్యోగం కోసం మహదితో కలిసి 2015లో క్లినిక్‌ను ఓపెన్ చేసింది. కానీ ఇద్దరి మధ్య కొన్నాళ్లకు గొడవ మొదలైంది. పాస్‌పోర్టును మహది లాగేసుకున్నాడు. దీంతో జూలై 25న మహదిని ప్రియా అనుకోకుండా చంపేసింది. ఈ కేసులో మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

