న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ జారీచేశారు. బుధవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షలివే
విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, జివ్ులు, స్పా సెంటర్లు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత.
సభలు, సమావేశాలపై నిషేధం.
50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లకు అనుమతి. 50 శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లకు అనుమతి.
మెట్రో, బస్సులను 50 శాతం సామర్థ్యంతో నడుపవచ్చు.
ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో అనుమతి.
అత్యవసరం కాని మాల్స్, దుకాణాలు సరి-బేసి పద్ధతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవచ్చు.
వివాహాలు, అంత్యక్రియల్లో 20 మంది మాత్రమే పాల్గొనాలి.