న్యూఢిల్లీ: సాధారణంగా మనిషి శరీరంలో ఎక్స్ఎక్స్, ఎక్స్, వై క్రోమోజోమ్‌లు ఉంటాయి. మొత్తంగా 23 జతల్లో.. 22 జతలు దైహిక క్రోమోజోమ్స్, ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ లైంగిక క్రోమోజోమ్స్ మహిళల్లో ఎక్స్, ఎక్స్‌గా, పురుషుల్లో ఎక్స్, వైగా ఉంటాయి. ఇందులో మహిళల ఎక్స్ క్రోమోజోమ్, పురుషుల ఎక్స్ క్రోమోజోమ్‌తో కలిస్తే ఆడ బిడ్డ, మహిళల ఎక్స్ క్రోమోజోమ్, పురుషుల వై క్రోమోజోమ్‌తో కలిస్తే మగ బిడ్డ పుడతాడు. కానీ, రెండు రకాల క్రోమోజోమ్‌లను ఒకే మనిషి నుంచి పుట్టించారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. నార్తవెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అద్భుత సృష్టికి ఆద్యులయ్యారు.