Report | ఒకే ఒక్క దశాబ్దం… మాయం కానున్న ఏనుగులు, కప్పలు, చేపలు
ప్రపంచం.. ఒక్క మనిషి సొత్తే కాదు. మనిషే సర్వస్వం కాదు. మనిషి కూడా ఇందులో భాగం. రక రకాల జీవరాశులు, చెట్లు, చేమలు, జంతువులు

ప్రపంచం.. ఒక్క మనిషి సొత్తే కాదు. మనిషే సర్వస్వం కాదు. మనిషి కూడా ఇందులో భాగం. రక రకాల జీవరాశులు, చెట్లు, చేమలు, జంతువులు… ఇలా అన్ని కలగలిపితేనే ప్రపంచం. మనిషి జీవితమే ఓ విచిత్ర జీవితం. ఆ విచిత్ర జీవనం నుంచి కాస్త రిలీఫ్ పొందడానికి అప్పుడప్పుడు ప్రకృతికి చేరువవుతాడు. రకరకాల జీవరాశులను చూస్తూ మానసిక ఆహ్లాదాన్ని పొందుతాడు. అవేవీ లేకుండా… కేవలం మనుషులే ఉంటే.. ఊహించుకుంటేనే భయం పుడుతోంది కదా… మరో దశాబ్దం తర్వాత పరిస్థితి ఇలాగే మారిపోతోందని ఓ సర్వే తేల్చి చెప్పింది.
‘వరల్డ్ వైడ్ ఫండ్’ అనే సంస్థ పశువులు, పక్షులు, చెట్లు వీటిపై అధ్యయనం చేస్తుంది. ఈ సంస్థ తాజాగా ఓ తీవ్రమైన హెచ్చరికే చేసింది. మరో దశాబ్ద కాలంలో ఈ భూ ప్రపంచం మహా వినాశనం వైపు దారితీస్తుందని, రక రకాల చెట్లు, జంతువులు ఇవన్నీ లుప్తమైపోతాయని తీవ్రంగా హెచ్చరించింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ 2021 సంవత్సరంలో ‘విన్నర్-లూజర్’ పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టింది.

ఏనుగులు, కప్పలు, ఎలుగుబంట్లు మాయం….
డైనోసార్ లుప్తమైన తర్వాత… అంత పెద్ద జంతు వినాశనం ఎప్పుడూ జరగలేదని, కానీ.. ఓ దశాబ్దం తర్వాత అంత పెద్ద జంతు వినాశనం జరగబోతోందని ఆ సంస్థ తేల్చింది. దాదాపుగా ఓ కోటి వృక్ష జాతులు, జంతు జీవాలన్నీ వినాశనమవుతాయని ఆ సంస్థ పేర్కొంది. ఏనుగులు, ధృవపు ఏలుగుబంట్లు, సొర చేపలు, కప్పలు, చేపలు… ఇలా ఓ 10 లక్షల జీవాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.

అయితే 142,500 జాతులను రెడ్‌లిస్ట్‌లో చేర్చామని, అందులో40 వేల జాతులు లుప్తమవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్రికా అడవుల్లో ఉండే ఏనుగులు అంతరించిపోవడానికి అతి దగ్గరగా ఉన్నాయని, గత 31 సంవత్సరాల్లో 86 శాతం మేర ఏనుగుల సంఖ్య తగ్గిందని ‘వరల్డ్‌వైడ్ ఫండ్’ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

