ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్‌ను ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ రికార్డు బ్రేకింగ్ ఎలివేటర్ 25.78 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చూసేదానికి ఒక చిన్న ఫ్లాట్ లాగా కనిపించే దీని బరువు 16 టన్నులు. ఈ ఎలివేటర్‌ను ఫిన్నిష్ కంపెనీ కోన్ నిర్మించింది. 4-ప్యానెల్ సెంటర్ ఓపెనింగ్ డోర్ వ్యవస్థలో ఉండే ఈ ఎలివేటర్‌కు బయటి దృశ్యాలు కనిపించేలా నాలుగు వైపులా గ్లాస్ ఫిట్టింగ్తో గోడలు ఏర్పాటు చేశామని కంపెనీ పేర్కొన్నది.