షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. తాషిగ్యాంగ్, స్పిటిలో ఆ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌గా రికార్డు క్రియేట్ చేశారు. ఇవాళ హిమాచల్‌లో అసెంబ్లీ ఎ న్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL
— CEO Himachal (@hpelection) November 12, 2022
ఇక కొండ ప్రాంతాల వాళ్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తులో ఉన్న తాషిగ్యాంగ్ బూత్‌లో మొత్తం 52 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్ల కోసం ఆ బూత్‌ను మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చారు. హిమాచల్‌లో మొత్తం 68 నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 17.98% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.