Super model | సూపర్ మోడల్ వరల్డ్-2022 పోటీలకు జైపూర్ సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ ఈ నెల 15 న జరుగనున్నది. సూపర్ మోడల్ వరల్డ్ టైటిల్‌ను ఎగరేసుకుపోవడానికి దేశవిదేశాలకు చెందిన అందగత్తెలు పోటీపడుతున్నారు. మెగా ఈవెంట్‌కు ముందు వీరు స్థానికంగా జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరై ఆశ్చర్యచకితులను చేశారు.
రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ ప్రపంచంలోని టాప్ మోడల్స్‌తో కలకలలాడుతున్నది. రష్యా మొదలు శ్రీలంక, భూటాన్ వరకు 30 దేశాలకు చెందిన టాప్ మోడల్స్ జైపూర్ చేరుకున్నారు. ఈ నెల 15 న నిర్వహించే సూపర్‌మోడల్ వరల్డ్-2022 పోటీల వేదికపై మెరవనున్నారు. ఈ పోటీలో 3 దశల్లో వివిధ థీమ్ ఆధారిత రౌండ్లు ఉంటాయి. ఇందులో సూపర్ మోడల్ క్యాట్ వాక్ చేయనున్నారు. సికార్ రోడ్డులోని మిరాకిల్ రిసార్ట్‌లో నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్లో సూపర్ మోడల్స్ తమ దేశ సంస్కృతిని చాటిచెప్పే దుస్తులు ధరించి తళుకులీననున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి, నైతిక, కుటుంబ విలువలను ప్రోత్సహించడమే అని పోటీల నిర్వాహకురాలు ప్రియాంక నితిన్ దూబే చెప్పారు. వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వం కింద సాంస్కృతిక మార్పిడి చేయొచ్చని పేర్కొన్నారు. ఈ పోటీల ఫైనల్‌ను జైపూర్‌లో నిర్వహించడం తమకు గొప్ప అనుభూతిని కలుగజేస్తుందని ఆమె తెలిపారు.