IIT Upskilling Course | న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ఆన్లైన్ అప్‌స్కిల్లింగ్ కోర్సులకు ఆదరణ పెరిగింది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో 70 శాతం మంది మూడేళ్లలోపు ఉద్యోగ అనుభవం కలవారు. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో వీరు ఈ కోర్సులను నేర్చుకుంటున్నారు.