న్యూఢిల్లీ, నవంబర్ 2: మహిళా హక్కుల కార్యకర్త, సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్ అసోసియేషన్ (సేవా) వ్యవస్థాపకురాలు ఇలా భట్ (89) బుధవారం కన్నుమూశారు. మహిళలు ఆర్థిక సాధికారతను సాధించడానికి ఇలా భట్ ఎంతో కృషి చేశారు. తాను స్థాపించిన సేవా సంస్థ ద్వారా మహిళలకు రుణాలు ఇస్తూ వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేశారు. ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.