న్యూఢిల్లీ : స్వింగ్ రైడ్ చేస్తున్న ఇద్దరు మహిళలు శిఖరం అంచునుంచి కిందపడిపోయిన పాత వీడియో (Viral Video) లేటెస్ట్గా వైరల్ అవుతోంది. రష్యాకు చెందిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సర్క్యులేట్ అవుతోంది. స్వింగ్ చైన్ తెగిపోవడంతో ఇద్దరు మహిళలు లోయలో పడిపోయిన ఘటన రష్యన్ రిపబ్లిక్ డజెస్టన్లోని సులక్ కన్యన్ ప్రాంతంలో వెలుగుచూసింది.
— Shocking Videos (@hold_it1) March 13, 2023
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఉయ్యాలలో కూర్చుని ఊగుతుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి ఉయ్యాలను తోయడం కనిపిస్తుంది. ఆపై ఉయ్యాల చైన్ తెగిపోవడంతో ఇద్దరు మహిళలు 6300 అడుగుల ఎత్తున్న కొండ మీద నుంచి కింద పడిపోతారు.
అదృష్టవశాత్తూ ఇద్దరు మహిళలు స్వల్పగాయాలతో బయటపడటం ఊరట ఇస్తుంది. తొలుత ఇద్దరూ జాయ్రైడ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించగా ఒక్కసారిగా చైన్ తెగిపోవడంతో వారికి చుక్కలు కనిపిస్తాయి. వారికి ఇంత రిస్కీ ఫీట్ అవసరమా అని యూజర్లు మహిళలపై భగ్గుమన్నారు.
Read More :
Viral News | ఆడబిడ్డను కన్న కోడలికి పూల తివాచీతో స్వాగతం.. పాప పాదముద్రలు తీసుకొని సంబురాలు