Viral Video : ఆత్మీయులతో కలిసి ఇష్టమైన ఆహార పదార్ధాలతో ఒక రోజంతా బీచ్‌లో గడపడాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కొందరు ప్యాకేజ్డ్ ఫుడ్‌తో సరిపెట్టుకుంటే మరికొందరు ఇంటి వద్ద స్పెషల్ డిషెస్ తయారుచేసుకుని తమతో పాటు తెచ్చుకుని బీచ్ హాలిడేను ఎంచక్కా ఆస్వాదిస్తారు. ఇటీవల ఓ కంటెంట్ క్రియేటర్ అవెరీ సైరస్ ఏకంగా బీచ్‌లోనే సముద్రపు వాటర్‌ను వాడి పాస్తాను వండివార్చింది.
బీచ్‌లోనే తాత్కాలిక కిచెన్ ఏర్పాటు చేసి మరీ పాస్తాను ప్రిపేర్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఈ రీల్ ఇప్పటివరకూ ఏకంగా 1.8 కోట్ల వ్యూస్‌ను రాబట్టింది. ఇక ఈ వీడియోలో ముందుగా కట్టెల మంటను రెడీ చేసిన అవెరీ ఆపై పిండిని సిద్ధం చేసి దానిపై రెండు ఎగ్స్‌ను క్రాక్ చేస్తుంది.
ఆపై వెల్లుల్లి పేస్ట్, చీజ్‌ను జోడించి సాస్‌ను వండుతుంది. ఆపై దాన్ని పక్కకుపెట్టి సముద్రంలోకి పరిగెత్తి అక్కడి నుంచి నీటిని తీసుకువచ్చి ప్యాన్‌పై వేసి పాస్తాను బాయిల్ చేస్తుంది. ఆపై పాస్తాను ప్రిపేర్ చేసిన అవెరీ దానిపై సాస్ వేసుకుని బీచ్‌లోనే సన్‌సెట్‌ను ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేస్తుంది.
Read More :