woman stabs sister-in-law | భర్తతో వివాహేతర సంబంధం.. ఆడపడుచును హత్య చేసిన మహిళ
woman stabs sister-in-law | భర్త, ఆడపడుచు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ఒక మహిళ తెలుసుకున్నది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి ఆమెను హత్య చేసింది. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
లక్నో: భర్త, ఆడపడుచు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ఒక మహిళ తెలుసుకున్నది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి ఆమెను హత్య చేసింది. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితురాలిని అరెస్ట్ చేశారు. (woman stabs sister-in-law) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. జూలై 12న నిదా అనే మహిళ ఆమె ఇంట్లో హత్యకు గురైంది. కత్తి పోట్ల వల్ల మరణించిన ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బయట వ్యక్తులు కాకుండా ఇంట్లోని వాళ్లే ఆమెను హత్య చేసినట్లు అనుమానించారు. తగిన ఆధారాలతో రింషా అనే మహిళను అరెస్ట్ చేశారు.
కాగా, రింషా భర్త ఉవైస్, ఆడపడుచు నిదా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రింషాకు ఈ విషయం తెలియడంతో నిదా, ఆమె మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
మరోవైపు జూలై 12న మధ్యాహ్న సమయంలో రింషా తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆ ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వంటగదిలోని కూరగాయలు కోసే కత్తితో నిదా ఛాతిపై రింషా పొడవటంతో ఆమె మరణించింది.
అయితే అరెస్టైన నిందితురాలు రింషా తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. ఈ సంఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- affair
- Husband
- Meerut
- Sister-in-law
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

