ముంబై : ఓ మహిళ రన్నింగ్ ట్రైన్‌ను ఎక్కబోతుండగా.. ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ ఘటన ముంబైలోని వాసయి రోడ్డు రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఓ రైలు నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఈ సమయంలో ఇద్దరు మహిళలు రైలును ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఒక మహిళ రైలు ఎక్కబోతుండగా జారి పడిపోయింది. వెనుకాలే వెళ్తున్న మరో వ్యక్తి అప్రమత్తమై.. ఆమెను ప్లాట్‌ఫాం పైకి లాగేందుకు ప్రయత్నించాడు. మరికొందరు వచ్చి ఆమెను సురక్షితంగా బయటకు లాగారు.
#WATCH | Maharashtra: Passengers saved a woman from falling under a moving train at Vasai Road Railway Station, yesterday.
— ANI (@ANI) September 19, 2021
(Source: CCTV at the railway station) pic.twitter.com/SBvmCWWAeU