Professor Murdered: ఫ్లాట్ లాక్ చేసి ఉంది.. గది లోపల మహిళా ప్రొఫెసర్ హత్య
Professor Murdered: ఢిల్లీలో ఓ మహిళా ప్రొఫెసర్ దారుణంగా హత్యకు గురైంది. ఆమె ఫ్లాట్ లాక్ చేసి ఉంది.. కానీ ఇంటి లోపల ఆ ప్రొఫెసర్ డెడ్‌బాడీ ఉంది. శివాజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ టీచర్ హత్యకు గురైంది. వసుంధర ఎన్‌క్లేవ్‌లో తన ఫ్లాట్‌లో ఆమె శవమై తేలింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. శివాజీ కాలేజీలో దేవోస్మితా పౌల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉన్న సత్యం అపార్ట్‌మెంట్స్‌లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నది. ఆమె భర్త బెంగుళూరులో ఉంటున్నారు. న్యూ అశోక్ నగర్ పోలీసు స్టేషన్‌కు గురువారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు తమకు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. 49 ఏళ్ల దేవారతి పౌల్ ఆ ఫోన్ చేశాడు.
తన సోదరి ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. ఉదయం నుంచి ఆమె ఫ్లాట్ డోర్ లోపలి నుంచి లాక్ వేసి ఉందన్నాడు. దేవోస్మితా పౌల్ తన ఫోన్‌కు స్పందించడం లేదని పోలీసులకు చెప్పారు. ఏదో జరిగిందన్న అనుమానంతో సోదరుడు దేవారతి పౌల్ ఆ ఇంటి లాక్‌ను బ్రేక్ చేసి ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. ప్రొఫెసర్ దేవోస్మితా ఇంట్లో చనిపోయి కనిపించిందన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె తలపై గట్టి దెబ్బ తగిలింది. తలపై చాలా లోతుగా గాయమైనట్లు గుర్తించారు. చేతి మణికట్టు దగ్గర కత్తితో కోసేశారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె బాడీనీ ఎల్బీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంట్లో ఉన్న బంగారం, నగదు అలాగే ఉన్నాయని, దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు లేవని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. కేసును విచారించేందుకు కొన్ని బృందాలుగా ఏర్పడ్డారు. ఆధారాలు దొరికాయని, త్వరలోనే నిందితులను అరెస్టు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

