వాయు వేగంతో పనిచేసి, ఓ మేజర్ ట్రైన్ యాక్సిడెంట్‌ను నివారించిన మహిళ
ఓమ్వతీ… యూపీలోని ఓ మారుమూల పల్లెలో రైతు కూలీ. రోజువారీ లాగే తన పొలం పనుల కోసం రైలు పట్టాల వెంబడి నడుస్తూ వెళ్తోంది. ఎందుకో గానీ… ఆమె కన్ను రైలు పట్టాల వైపు వెళ్లింది. ఈ సమయంలోనే రైలు కూత వినిపిస్తోంది. దగ్గర్లోనే వుంది. ఆ రైలు పట్టాల మధ్య ఓ గ్యాప్ ఉందన్నది ఓమ్వతీ గుర్తించింది. అంతే… ఏమీ ఆలోచించలేదు. వెంటనే పక్కనున్న కర్రలను అప్పటికప్పుడు తీసుకొని వచ్చి, ఆ గ్యాప్ వున్న ప్రాంతంలో పాతేసింది. ఓ ఎరుపు రంగు చీరను ఆ కర్రలకు కట్టేసింది.
ఇదంతా కొన్ని క్షణాల్లోనే చేసేసింది. ఈ ఎరుపు రంగు చీరను రైల్ పైలట్ చూసి, అప్రమత్తమయ్యాడు. రైల్‌ను ఆపేశాడు. దీంతో కొన్ని వందల మంది ప్రాణాలను ఆ ఓమ్వతీ అనే రైతు కూలీ కాపాడింది. ఆ తర్వాత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, 30 నిమిషాల్లోగా ట్రాక్‌ను సరిచేశారు. దీంతో ఆ రైల్ క్షేమంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని పోలీసు అధికారులు షేర్ చేశారు. దీనికి 58 వేల లైకులు వచ్చాయి.
श्रीमती ओमवती।
सुबह खेत पर काम करने जा रही थीं।
ट्रैक पार करते समय अचानक टूटी पटरी पर नजर पड़ गई।
ट्रेन आने वाली थी, इन्होंने समझदारी दिखाते हुए अपनी लाल रंग की साड़ी को लकड़ियों की मदद से ट्रैक पर खड़ा कर दिया।ट्रेन रोकी गई, पटरी ठीक हुई तब 30 मिनट बाद ट्रेन रवाना हुई।👏 pic.twitter.com/j4SJPTN3kl
— SACHIN KAUSHIK (@upcopsachin) March 31, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

