చెన్నై: ఒక మహిళ తన చెల్లితో వ్యభిచారం చేయిస్తున్నది. (woman forced sister into prostitution) పిల్లల సంక్షేమ కమిటీకి ఈ విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ బాలికను పోలీసులు రక్షించారు. ఆమె అక్కతో సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. 14 ఏళ్ల బాలిక చెమ్మెంచేరిలో నివసిస్తున్నది. తన అక్కతో కలిసి ఉండేందుకు పదువంచెరికి వెళ్లింది. అయితే అక్క, ఆమె అత్త కలిసి ఆ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. కేకే నగర్, చెంగల్పట్టు సహా పలు ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లేవారు.
కాగా, చెంగల్పట్టులోని శిశు సంక్షేమ కమిటీకి ఈ విషయం తెలిసింది. దీంతో పోలీసులను వారు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో సెలైయూర్ మహిళా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక చోట రైడ్ చేసి ఆ బాలికను రక్షించారు.
మరోవైపు మొబైల్ ఫోన్ కాల్స్ రికార్డుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. బాలికతో వ్యభిచారం చేయిస్తున్న లక్ష్మి, కవిత, ప్రకాష్, దామోధరన్, కర్పగం, శ్రీనివాసన్ అనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.