డెహ్రాడూన్: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన మరొకటి జరిగింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్ చేసింది. ప్రమాదవశాత్తు జారి లోయలోకి పడింది. (Woman Making Reel Falls) తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక కుటుంబం శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించింది.
కాగా, ఆ కుటుంబానికి చెందిన 28 ఏళ్ల రేషు అక్కడి కొండపై రీల్ చేసింది. అయితే కాలు జారడంతో 70 మీటర్ల లోతైన లోయలో ఆమె జారిపడింది. గమనించిన కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఆ మహిళను పైకి తెచ్చారు. అంబులెన్స్‌లో తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हरिद्वार सेल्फी लेते हुए पहाड़ी से गिरी महिला
मनसा देवी पहाड़ी से नीचे गिरी महिला
गंभीर हालात को देखते हुए हायर सेंटर रेफर
परिजनों के साथ आई थी हरिद्वार pic.twitter.com/6Z8H8btlK2
— जनाब खान क्राइम रिपोर्टर (@janabkhan08) October 26, 2024