హైదరాబాద్: ఓ మహిళ తన బ్రేక్ డ్యాన్స్(Break Dance)తో అందర్నీ షేక్ చేసింది. చీర కట్టులో ఆమె చిందేస్తున్న తీరు ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్షేషన్‌గా మారింది. హీల్స్ వేసుకుని మరీ .. ఫుల్ జోష్‌లో ఆమె చిందేస్తోంది. చీరలో బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న ఆమె వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె నాట్య కళను చూసి నెటిజన్లు కేరింతలు కొడుతున్నారు.
నేపాల్హిప్హాప్ ఫౌండేషన్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేశారు. చీరలో చాలా ఈజీగా ఆ మహిళ స్టెప్పులు వేసింది. మ్యూజిక్కు తగినట్లు ఆమె డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ సమయంలో అక్కడ ఉన్న మహిళా గ్యాంగ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. తన మూవ్స్‌కు చీర అడ్డు వస్తున్నా.. ఆ లేడీ మాత్రం తన డ్యాన్స్ ఆపలేదు.
View this post on Instagram
A post shared by nepalhiphopfoundation01@gmail. (@nepalhiphopfoundation01)
సారీ డ్యాన్స్ వీడియోకు ఇప్పటికే 7.6 లక్షల వ్యూవ్స్ వచ్చాయి.