బాయ్ ఫ్రెండ్‌తో కలిసి భర్త హత్య.. 12 గంటల పాటు బెడ్రూమ్లోనే..
భర్త హత్య | తన అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్న భర్తను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హతమార్చింది ఓ భార్య. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కంచీపురం జిల్లాలో జులై 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సోమమంగళం

చెన్నై : తన అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్న భర్తను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హతమార్చింది ఓ భార్య. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కంచీపురం జిల్లాలో జులై 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలారాణి(37) దంపతులు. గత కొద్ది కాలం నుంచి రాణి.. ఓ యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
భర్తను చంపాలని ప్లాన్
ఈ గొడవల నేపథ్యంలో భర్తను చంపాలని భార్య నిర్ణయించుకుంది. దీంతో జులై 28న రాత్రి తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించుకుంది. భర్త నిద్రిస్తున్న సమయంలో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మరో ప్రాంతానికి తరలించి నిప్పంటించారు.
మృతుడి తండ్రి ఫిర్యాదుతో
అదెంచెరి కనిపించకపోవడంతో జులై 29న అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదెంచెరితో పాటు అతని భార్య, కుమారుడు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అదెంచెరి తండ్రి.. రాణికి ఫోన్ చేసి తమ కుమారుడు ఎక్కడ? అని ప్రశ్నించాడు. స్పందించిన రాణి.. తన కుమారుడు ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు.. ఇప్పుడు మాట్లాడటం కుదరదు అని దాటవేసింది. మొత్తానికి రాణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
పోలీసులను తప్పుదోవ పట్టించిన రాణి
ఈ కేసు విచారణలో భాగంగా రాణి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. సోమమంగళం గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో మృతదేహాన్ని పడేసినట్టు తొలుత చెప్పింది. అక్కడ శవం లభించకపోవడంతో మళ్లీ పోలీసులు ఆమెను విచారించారు. చెంగల్పట్టులోని అడవుల్లో అదెంచెరి మృతదేహానికి నిప్పు పెట్టామని తెలుపడంతో.. అక్కడి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
12 గంటల పాటు బెడ్రూమ్లోనే..
భర్తను చంపిన తర్వాత అతని మృతదేహం అక్కడే ఉంచి.. రాణి, ఆమె ప్రియుడు బెడ్రూమ్లోనే 12 గంటల పాటు గడిపారు. ఆ తర్వాత డెడ్‌బాడీని చెంగల్పట్టు తీసుకెళ్లి నిప్పంటించినట్లు రాణి తెలిపింది. ఈ కేసులో రాణి ప్రియుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

