Crocodile attack : వివాహ వేడుకకు బయలుదేరిన మహిళపై మొసలి దాడి (Crocodile attack) చేసి చంపింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బహ్రాయిచ్ జిల్లా (Bahraich district) సుజౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాభై ఏళ్ల కేతకీ దేవి (Ketaki Devi) అనే మహిళ ఆదివారం సాయంత్రం వివాహ వేడుకకు బయలుదేరింది. మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది ఒడ్డుకు వెళ్లిన ఆమెపై అమాంతం మొసలి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
బహ్రాయిచ్ జిల్లాలో సరయూ నది అనుసంధాన కాలువ ఒడ్డున ఈ ఘటన జరిగింది. మొసలి అమాంతం దాడిచేసి నీటిలోకి లాక్కెళ్లింది. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సాయంతో గ్రామస్థులు ఆదివారం మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. ఇదే ప్రాంతంలో రెండు రోజుల కిందట చౌధరీ చరణ్‌సింగ్ కాలువ నుంచి రోడ్డు మీదకు వచ్చిన మరో మొసలిని అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.