జార్ఖండ్ ;ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించిన అరుదైన సంఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. ఐదుగురు కూడా ఆడ శిశువులే కావడం మరో విశేషం. రాంచీలోని రిమ్స్‌లో చాతర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఏడో నెలలో జరిగిన కాన్పులో ఐదుగురు పుట్టారు. తల్లీ, బిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఒకే కాన్పులో ఐదుగురు పుట్టడాన్ని వైద్య పరిభాషలో ‘క్వింటుప్లేట్స్’గా వ్యవహరిస్తారు. 5.5 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.