లక్నో: ఒక మహిళ కనుబొమ్మలు చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. ఇది తెలిసి ఆమె భర్త అక్కడకు చేరుకున్నాడు. భార్యపై ఆగ్రహంతో ఆమె జడను కత్తిరించాడు. (Husband Cuts Wife’s Braid) అయితే అదనపు కట్నం కోసం తన కుమార్తెను భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏడాది కిందట రామ్ప్రతాప్కు ఒక మహిళతో పెళ్లి జరిగింది. వారం కిందట భార్య పుట్టింటికి చేరింది.
కాగా, శనివారం ఆ మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. కనుబొమ్మలు చేయించుకున్నది. ఈ విషయం తెలిసి రామ్‌ప్రతాప్ అక్కడకు చేరుకున్నాడు. భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లడంపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె జడను కత్తిరించాడు.
మరోవైపు ఆ మహిళ తండ్రి రాధాకృష్ణకు ఈ విషయం తెలిసింది. దీంతో అల్లుడైన రామ్ప్రతాప్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరకట్నం కోసం నిరంతరం తన కుమార్తెను వేధిస్తున్నాడని ఆరోపించాడు. రిఫ్రిజిరేటర్, కూలర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకే రామ్‌ప్రతాప్ తన కూతురి జడ కత్తిరించి వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.